Tuesday, April 22, 2025

వచ్చే వెయ్యి సంవత్సరాల భవితను తీర్చిదిద్దనున్న మా విధానాలు

- Advertisement -
- Advertisement -
  • తమ ప్రభుత్వం వాటిని రూపొందిస్తోంది
  • సివిల్ సర్వీసెస్ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : తన ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు వచ్చే వెయ్యి సంవత్సరాల భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉద్ఘాటించారు. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, భారత సంపూర్ణ అభివృద్ధి అంటే ఏ గ్రామమూ, ఏ కుటుంబమూ, ఏ పౌరుడూ వెనుకబడి ఉండకపోవడం అని చెప్పారు. ‘మేము ఇప్పుడు రూపొందిస్తున్న విధానాలు, మేము తీసుకుంటున్న నిర్ణయాలు వచ్చే వెయ్యి సంవత్సరాల భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి’ అని ఆయన సూచించారు. భారత ఆకాంక్షపూరిత సమాజం యువజనులు, రైతులు, మహిళలు దాని కలలు ఎన్నడూ కనని వినని రీతిలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నాయని మోడీ చెప్పారు. ‘ఆ అసాధారణ ఆకాంక్షల సాఫల్యానికి అసాధారణ వేగం ఆవశ్యకం’ అని ఆయన తెలిపారు. పథకాలు ఎంత ప్రగాఢంగా ప్రజలను చేరుకుంటున్నాయో, అట్టడుగున వాటి అసలు ప్రభావం ప్రభుత్వంలో నాణ్యతను నిర్ధారిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. గడచిన పది సంవత్సరాల్లో భారత్ ఎంతగానో పరివర్తనం చెందిందని ఆయన చెప్పారు. ‘పాలన, పారదర్శకత, ఆవిష్కరణల్లో భారత్ కొత్త కొలబద్దలు నెలకొల్పుతోంది’ అని ఆయన తెలిపారు. సాంకేతికత శకంలో పాలన వ్యవస్థల నిర్వహణ గురించి కాదని, అవకాశాల పెంపుదల గురించి అని మోడీ పేర్కొన్నారు. 2023లో భారత్ ఆతిథ్యం వహించిన జి20 శిఖరాగ్ర సదస్సు గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, ‘జన్‌భాగీదారీ’ (ప్రజా భాగస్వామ్యం) దృక్పథం ఆ సదస్సును ప్రజా ఉద్యమంగా మార్చిందని, ప్రపంచం గుర్తించిందని తెలిపారు. ‘భారత్ పాల్గొంటుండడమే కాకుండా సారథ్యం వహిస్తోంది’ అని ఆయన చెప్పారు. నిరుపేదల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించాలని, వారి మాటలు ఆలకించాలని, వారి మనోభావాలను మన్నించాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ప్రభుత్వ అధికారులను మోడీ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News