Tuesday, April 22, 2025

కెనెడాలో హిందూ దేవాలయంపై వేర్పాటువాదుల దాడి

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: కెనెడాలో మరోసారి సిక్కు వేర్పాటువాదులు రెచ్చిపోయారు. ఏప్రిల్ 19వ తేదీన ఖలిస్థానీ జెండాలతో సర్రేలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంలోకి ఇద్దరు వేర్పాటువాదులు ప్రవేశించారు. పెద్దగా నినాదాలు చేస్తూ.. లోపలికి వచ్చిన దుండగులు.. ఆలయ స్తంభాలు, ద్వారాలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు సిసి కెమెరాలను దొంగలించుకుపోయారు. భక్తుల మనోభావాలను దెబ్బతినేలా చేసే ఇలాంటి వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలయ అధికారులు తెలియజేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. భారత వ్యతిరేక శక్తుల హస్తం ఈ ఘటన వెనుక ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా ఆలయం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News