Tuesday, April 22, 2025

కెనడాలోని హిందూ మందిరంపై దాడి

- Advertisement -
- Advertisement -

కెనడాలోని సర్రేలో ఉన ఆలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడులకు పాల్పడ్డారు. దాని ప్రవేశద్వారం, స్తంభాలపై ఖలిస్థాన్ అనుకూల రాతలతో విధ్వంసకారులు విధ్వంసం సృష్టించారని అధికారులు తెలిపారు. సర్రేలోని శ్రీ లక్ష్మీ నారాయణ మందిరంలో ఏప్రిల్ 19న ఈ ఘటన జరిగినట్లు దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. మందిరం ప్రవేశం వద్ద, స్తంభాలపైన ‘ఖలిస్థాన్’ అని చెత్త రాతలు రాశారు. అంతేకాదు సెక్యూరిటీ కెమరాను కూడా ఎత్తుకెళ్లారు. కాగా ఈ ఉదంతంపై సర్రే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలయింది. శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇద్దరు ఖలిస్థానీ దుండగులు నినాదాలు చేస్తూ ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా, స్తంభాలు, ద్వారాలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారని ఆలయ అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News