Tuesday, April 22, 2025

‘అఖండ 2’లో విజయశాంతి?

- Advertisement -
- Advertisement -

నటసింహం బాలయ్య, – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోందని, పైగా రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో బాలయ్య, – విజయశాంతి కలయికలో ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. పైగా కల్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో విజయశాంతి నటించి అలరించారు.

మరి ఈ నేపథ్యంలో విజయశాంతి ‘అఖండ 2’ లో నటిస్తే.. ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను, – బాలయ్య కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News