Tuesday, April 22, 2025

మంగళవారం రాశి ఫలాలు(22-04-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. రావాల్సిన ధనాన్నిఇవ్వవలసిన వాళ్ళు సమయానికి అందుబాటులో ఉండరు.

వృషభం – వృత్తి వ్యాపారాలలో మార్పులు ఉంటాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతను ఇచ్చి సరికొత్త నిర్ణయాలను అమలు చేస్తారు.

మిథునం – అనేక మందికి అనేక విధాలుగా సహాయం అందిస్తారు. ఎదురుచూడని అవకాశాలు లభిస్తాయి.  పనులలో ఏర్పడిన ఒడిదుడుకులను అధిగమించగలుగుతారు.సంఘం లో మీ మాటకు విలువ పెరుగుతుంది.

కర్కాటకం – కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నమ్మకం లేని వ్యక్తులకు పరిస్థితులకు లోబడి కొన్ని బాధ్యతలు అప్పగించవలసి వస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి.

సింహం – జీవిత భాగస్వామి ద్వారా ధన లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.

కన్య – వృత్తి- వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. స్పెక్యులేషన్లో నష్టం రాకపోవడమే పరోక్ష లాభంగా పరిణమిస్తుంది. క్రయవిక్రయాలు గతంలో కన్నా ఎక్కువగా సాగిస్తారు.

తుల – సంప్రదింపులు చర్చలు ఫలవంతంగా ఉంటాయి. ఇతరుల బాధ్యతలను కూడా మీరే నెత్తిన వేసుకుని కార్యక్రమాలను జరుపుతారు. కుటుంబంలో స్వల్పమైన విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి.

వృశ్చికం – నిలకడలేని ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఎన్ని మెలకువలు పాటించినప్పటికీ మానసిక, శారీరక ఒత్తిడి నుండి తప్పించుకోలేరు. సౌందర్య సాధక చిట్కాల పట్ల ఆకర్షితులు అవుతారు.

ధనుస్సు – ఇష్టం లేని వ్యక్తులకు దూరంగా ఉంటారే తప్ప వాగ్వివాదాలకు దిగరు. స్వార్ధం లేని లౌకిక ప్రపంచంలో నెగ్గడం కష్టమని భావించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

మకరం – వృత్తి- ఉద్యోగ వ్యవహారాలను, కుటుంబ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. ఎంత చేసినా సంతృప్తి లేని వర్గాన్ని దూరంగా ఉంచాలని కృతనిచ్చయానికి వస్తారు.

కుంభం – భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. మొండి బాకీలను రాబట్టుకోవడానికి కొత్త మార్గాలను అవలంబిస్తారు.

మీనం – మీకు ఎంత మాత్రం సంబంధం లేనటువంటి వివాదాలలోకి మిమ్మల్ని లాగే ప్రయత్నాలు జరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News