Tuesday, April 22, 2025

పరలోకానికి పోప్ ఫ్రాన్సిస్

- Advertisement -
- Advertisement -

వాటికన్ సిటీలో అధికారిక నివాసంలో అంతిమశ్వాస కొంతకాలంగా శ్వాసకోశ
వ్యాధులతో బాధపడుతున్న పోప్ సుదీర్ఘ చికిత్స అనంతరం గత నెలలోనే
డిశ్చార్జి అయిన కేథలిక్ మతపెద్ద ప్రపంచానికి ఈస్టర్ సందేశం ఇచ్చిన
మరునాడే కన్నుమూత దివ్యలోకమున మరో నక్షత్రం వెలిసిందన్న వాటికన్
ప్రధాని మోడీ, సిఎం రేవంత్, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, కెటిఆర్ సంతాపం

వాటికన్ సిటీ: కేథలిక్ క్రిస్టియన్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన క్రిస్టియన్లకు పరమ పవిత్రమైన ఈస్టర్ రోజున భౌతికంగా తనువు చాలించారు. ఈ పరిణామంతో క్రైస్తవ ప్రపంచం విషాదంలో మునిగింది. ఫ్రాన్సిస్ మరణ వార్త సంకేతంగా చర్చిల్లో గంటలు మోగా యి. ప్రపంచ వ్యాప్తంగా చర్చిల్లో ప్రార్థనా సమావేశాలు నిర్వహించారు. దివ్యలోకమున మరో నక్షత్రం వెలిసిందని వాటికన్ సిటీ ఆయన మరణ సందేశంలో పేర్కొంది. వాటికన్ సిటీలోని శాంటా మార్టాలోని ఆయన నివాసంలో ఫ్రాన్సిస్ పరమపదించినట్లు వాటికన్ వర్గాలు ప్రకటనలో తెలిపా యి. సోమవారం ఉదయం 9.45 గంటలకు ఆయ న మరణవార్త వెల్లడించారు. ‘ఫాదర్ ఇక లేరు. ఆ యన పరమపద లోకాలకు వెళ్లారనే విషాద వార్త ను అందరికి తెలియచేయడం జరుగుతోంది’ అని తెలిపారు. ఆయన తన తండ్రి నివాసానికి ఏతెంచారు. జీవితాంతం పేదల సేవలో. లార్డ్ పట్ల అంకితభావంతో గడిపారని ప్రకటనలో తెలిపారు. 88 వ ఏట పోప్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

ఇటీవలే చికిత్స తరువాత జెమియిల్లి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తరువాత తొలిసారిగా సెయిం ట్ పీటర్స్ బెసిలియా వేదికగా ప్రజల ముందుకు వచ్చారు. ఇన్‌ఫెక్షన్‌తో ఫ్రాన్సిస్‌కు డబుల్ న్యూమోనియా రావడంతో ఇక కోలుకోలేకపోయారు. పోప్ మరణంతో అధికారికంగా 14 రోజుల సంతాపం దినం పాటిస్తారు. మతాచారాల ప్రకారం ఆయనక ఖననం తరువాతి తంతు సాగుతుంది. ఆ తరువాత వికార్ ఆఫ్ క్రైస్ట్‌ను నూతనంగా ఎంచుకుంటారు. 2013లో పోప్ బెనిడెక్ట్ తరువాత ఫ్రాన్సిస్ ఈ బాధ్యతలలోకి వచ్చారు. ఫ్రాన్సిస్ అర్జెంటీనాలో 1938లో జన్మించారు. దక్షిణ అమెరికా నుంచి కీలక మత పెద్ద స్థానానికి ఎదిగారు. కేవలం మత పరమైన విషయాలనే కాకుండా పోప్ అనేక సందర్భాల్లో మతాతీత, సార్వజనీక, ప్రాపంచిక విషయాలను విశ్లేషించారు. ప్రత్యేకించి శరణార్థులకు న్యా యం, పునరావాసం కోసం ఆయన నిరంతరం పాటుపడ్డారు. ఆయన కరుణా, సహృదయత, సే వాభావాన్ని జనం ఆదరించారు. 2016లో రోమ్ వెలుపల ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలను ఆయన కడిగారు. వినయం, సేవాతాత్పరతకు ఇది దర్పణం అయింది. పోప్ మరణంపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా, రష్యా సహా ప్రపంచ దేశాధినేతలు సంతాపం ప్రకటించారు. భారత్‌లోని కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.

మరణానికి ముందు కూడా సందేశం
పోప్ ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడవడానికి కొద్ది గంటల ముందు ఈస్టర్ పర్వదినం నేపథ్యంలో భక్తులకు సందేశం వెలువరించారు. పీటర్ స్కేర్‌లో 35,000 మంది సమూహాన్ని ఉద్ధేశించి మాట్లాడా రు. సోదరీ సోదరులారా, శుభాకాంక్షలు అని పలికారు. గాజా, ఉక్రెయిన్ వంటి ఘర్షణాయుత ప్రాంతాలలో తక్షణ శాంతి, సామరస్యాల కోసం పిలుపునిస్తూ వచ్చారు. పోప్ వారికి మూడు చాకోలెట్ ఈస్టర్ ఎగ్స్‌ను బహుకరించారు. చివరి సందేశానికి ఆయన ప్రత్యేక వాహనంలో తరలివచ్చారు, మధ్యలో అక్కడక్కడ ఆగి పసికందులు, చిన్నారుల ను ఆశీర్వదించారు. పోప్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

విభిన్నతలు, వివాదాస్పద అంశాలు
2013లో బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయ న వాటికన్ సిటీ ఆచరణ ప్రక్రియకు నూతన మార్గదర్శకత్వం వహించారు. అయితే కన్సర్వేటివ్స్ కొ న్ని సందర్భాలల్లో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. అయితే తాను విభిన్నమైన పోప్‌ను అని ఆయన తమ చర్యల ద్వారా చాటుకున్నారు. ప్రత్యేకించి ఫ్రాన్సిస్ సామాజిక అభ్యుదయవాదం, కొన్ని దశలలో వామపక్ష భావజాలం వంటివి అందరిని కదిలించాయి. ఎల్‌జిబిటిక్యూ, క్యాథలిక్స్, సాంప్రదాయవాదుల పట్ల కటువుగానే వ్యవహరించారు. 2018లో మతపెద్దల లైంగిక అక్రమాల వ్యవహారా న్ని ఆయన ఎదుర్కొవల్సి వచ్చింది. గుంపులు గుం పులుగా జనం మధ్య ఉండే పోప్ కరోనా వంటి ప్ర పంచ వ్యాప్త సంక్షోభ దశలో, లాక్‌డౌన్‌ల సమయం లో తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. ఈ ప్రపంచం ఇక ఎవరికి వారుగా ఉంటే మనుగడ సాగదనే సందేశాన్ని కరోనా మహమ్మారి చాటి చెప్పిందని, మానవాళి ఇటువంటి చేదు అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకుని తీరాలని సందేశాలు వెలువరించారు.విద్వేషం, ఒకరంటే ఒక్కరికి పడని మనస్థత్వం మానవాళి మనుగడకు ప్రమాదకరం అని హెచ్చరించారు

సంస్కరణలే నినాదం ..
సంస్కరణల అజెండాలతోనే ఆయన కీలక పదవి స్వీకరించారు. ఇంతకాలం చర్చిలు లైంగిక అవలక్షణాలతో ఉన్న ప్రత్యేక వర్గాల పట్ల ఏహ్యభావం, ఈసడింపులు చూపుతూ వచ్చాయి. అయితే తమ హయాంలో ఇది సాగదని , అంతా ఒక్కటే అనే రీతిలో వ్యహరిస్తామని వెల్లడించారు. ఇక అత్యంత వివాదాస్పదమైన మరణశిక్షలు, అణ్వాయుధాల వేలంవెర్రి వంటి వాటిపై నిర్మోహమాటంగానే వ్యవహరించారు. ఇక పరమత సహనం, ఆదరణ ఆయన నైజం అయింది. అరేబియా దేశాలలో పర్యటించడం ద్వారా ముస్లిం వర్గాలకు స్నేహహస్తం అందించారు. అన్నింటికి మించి చర్చి అనేది శరణార్థుల వేదిక కావాలని, ఆశ్రితులను ఆదుకోవాల్సి ఉంటుంది, ఖైదీలు, వెలివేయబడ్డ వారికి చర్చి ద్వారాలు ఎల్లవేళలా తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. విలాసవంతమైన రాజభవన ప్రసాదంలో కాకుండా ఆయన వాటికన్ హోటల్‌లోనే ఎక్కువగా నివసించేవారు. కేవలం సందేశాల విషయంలోనే కాకుండా ఆయన సాగించిన నిరాడంబర జీవనశైలి,

వస్త్రధారణ, ఆహార్యం, అలవాటుల ప్రత్యేకించి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా వాడే ప్రత్యేక పాదరక్షలకు బదులుగా సర్వసాధారణ చెప్పులు వేసుకునే వారు.యూరప్ శరణార్థుల సంక్షేమం ఆయన తొలి కార్యాచరణం అయింది. చర్చి అంటే అవినీతి లేని వేదికగా నిలవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ వచ్చిన పోప్ ఇందులో భాగంగానే బ్యూరోక్రసీని అదుపులో పెట్టారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. దేవుడి వద్దకు అపార నమ్మకంతో వచ్చే వేలాది మంది నుంచి పరిమిత రీతిలోనే పద్ధతి ప్రకారం కానుకలు తీసుకోవాలని, దీనికి కూడా సరైన లెక్కాపత్రాలు చూపాలని స్పష్టం చేశారు. లేకపోతే కఠినచర్యలకు గురి కావల్సి ఉంటుందని ఆయన చేసిన హెచ్చరికలు ఫలించాయి. ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారం వాటికన్ సిటీ కేంద్రంగా సాగిందనే ఆరోపణలు రావడంతో సోదాల నిర్వహణకు ఆయన పోలీసులకు అనుమతిని ఇచ్చారు. నేరం ఎక్కడ జరిగినా విచారణ, తదుపరి దర్యాప్తు సముచిత శిక్షలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News