Tuesday, April 22, 2025

త్వరలో 30వేల ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

యువత ఉపాధి కోసం మూడంచెల
వ్యూహం 100 పైగా కంపెనీల్లో
5వేల ఉద్యోగావకాశాలు
రాజీవ్ యువ వికాసం కింద
జూన్ 2న స్వయం ఉపాధి
యూనిట్ల పంపిణీ మెగా జాబ్
మేళాలో డిప్యూటీ సిఎం భట్టి

మన తెలంగాణ/మధిర: కోరి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం ప్రజా ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లా, మధిర రెడ్డి గార్డెన్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మధిర పట్టణంలోని రెడ్డి గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళాలో 100కు పైగా కంపెనీలు పాల్గొని, 5 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీ ప్రతినిధులు ముందుకు వచ్చారని అన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత పది సంవత్సరాలుగా పాలకులు యువతను నిర్లక్ష్యం చేశారని, యువతకు ఉపాధి అవకాశాలు చూపించడంలో వైఫల్యం చెందారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందని అన్నారు.

ఇందులో భాగంగా మొదట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలండర్ విడుదల చేశామని అన్నారు. మొదటి దశలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోందని అన్నారు. రెండవ దశలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గ్లోబలైజేషన్‌లో భాగంగా వస్తున్న మార్పులను అలవర్చుకొని బహుళజాతి సంస్థలకు రాష్ట్రంలో అవసరమైన వనరులు కల్పించి భారీ ఎత్తున పెట్టుబడులు, వీటి ద్వారా యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు సాధిస్తున్నామని అన్నారు. మూడవ దశలో ఉపాధిని ప్రోత్సహించేందుకు రూ.9 వేల కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాసం పథకం కింద యువతకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ.. జీవితంలో విజయం సాధించేందుకు మనపై నమ్మకం ఉండడం చాలా ముఖ్యమని, చిన్న ఉద్యోగమైనా చేరితే మనలో విశ్వాసం పెరుగుతుందని, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది తోడ్పాటు అందిస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News