Tuesday, April 22, 2025

పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం…. కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మునగాల గ్రామానికి చెందిన నారగాని రాంబాబు(38) కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. సోమవారం విధులు ముగించుకొని తన సొంత గ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. ముకుందాపురం స్టేజీ వద్ద రోడ్డుపై సూచికలు లేకుండా నిలిపిన కారును ఢీకొట్టాడు. రాంబాబు తీవ్రంగా గాయపడడంతో సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News