హైదరాబాద్: ఒకరిని లేదా ఇద్దరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ ఏకంగా ఓ వ్యక్తి 35 మందితో డేటింగ్ చేశాడు. పురాణాలలో శ్రీకృష్ణుడు 16 వేల మంది గోపికలను పెళ్లి చేసుకున్నారు. జపాన్‌కు చెందిన తకాశి మియాగావా అనే వ్యక్తి 35 మందితో సహజీవనం చేశాడు. ఆ వ్యక్తి నిజ స్వరూపం బయటపడడంతో 35 మంది బామలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసలు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తకాశి సేల్స్‌మెన్‌గా పని చేసేవాడు. తకాశి మంచి మాటకారి కావడంతో చూస్తుండగానే అమ్మాయిలను బుట్టులో వేసుకునేవాడు. సంవత్సరం పొడవునా ఏదో ఒక రూపంలో బహుమతులు పొందాలని ప్లాన్ చేశాడు.
కస్టమర్స్‌తో ఏమోషనల్‌గా కనెక్ట్ అవుతూ వచ్చాడు. ప్రేమ పేరుతో వారితో దగరయ్యేవాడు. 35 మంది సహజీవనం చేస్తూ ఏదో ఒక్కో రోజు తన బర్త్ డే అని చెబుతూ బహుమతులు తీసుకునేవాడు. సహజీవనంలో బహుమతులు ఇవ్వడం అనేది జపాన్ లో అనవాయితీగా వస్తుంది. ఎక్కువ సార్లు బహుమతులు తీసుకొని ఎంజాయ్ చేసేవాడు. లక్షల రూపాయల బహుమతులు తీసుకొని సంతోషంగా ఉండేవాడు. మనోడి సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. ఓ యువతి అతడి గురించి తెలుసుకొని విక్టిమ్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. దీంతో అతడి బాధితులు 35 మంది రావడంతో నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మోసం చేశాడనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళలను తప్పుదారి పట్టించి ఆర్థిక లాభం పొందారని జపాన్ చట్టం ప్రకారం శిక్షగా పరిగణించబడింది.