- Advertisement -
ఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో షర్బత్ జిహాద్ నడుస్తోందన్న రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ కోర్టు మండిపడింది. బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై హమ్‌దర్ద్ సంస్థ పిటిషన్ వేయడంతో కోర్టులో విచారణ జరిగింది. రాందేవ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఏ మతాన్ని కించపర్చలేదన్న రాందేవ్ బాబా లాయర్ న్యాయస్థానానికి తెలిపాడు. ఇలాంటి వ్యాఖ్యలకు ముందు అంతరాత్మను ప్రశ్నించుకోవాలని చురకలంటించింది. బాబా రాందేవ్ షర్బత్ జిహాద్ వ్యాఖ్యలకు కోర్టు చీవాట్లు పెట్టింది. ఇలాంటి వ్యాఖ్యలు సభ్యసమాజానికి సిగ్గుచేటు అని మందలించింది.
- Advertisement -