Tuesday, April 22, 2025

బుమ్రాకు అరుదైన గౌరవం.. స్మృతి మంధనకు కూడా..

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే బుమ్రా.. మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2024 సంవత్సరానికి అతను విజ్డెన్ మెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్‌గా ఎంపికయ్యాడు. 2024లో బుమ్రా అన్ని ఫార్మాట్‌లలో 86 వికెట్లు తీశాడు. ముఖ్యంగా టెస్టుల్లో అద్భుతంగా రాణించి అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక గత ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన అతను జట్టు ప్రపంచకప్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. గతంలో ఈ అవార్డు కేవలం ముగ్గురు భారతీయులకు మాత్రమే అందుకున్నారు. విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ అవార్డు అందుకున్న నాలుగో వ్యక్తిగా బుమ్రా నిలిచాడు

ఇక మహిళల లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ అవార్డు స్మృతి మంధనకు దక్కింది. 2024లో మూడు ఫార్మా్ట్లలో కలిపి 1659 పరుదులు చేసింది. అందులో నాలుగు వన్డే సెంచరీలు, ఒక టెస్టు సెంచరీలు ఉన్నాయి. ఒక క్యాలెండర్ ఇన్ని పరుగులు ఎవరు చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News