- Advertisement -
ఓ శిక్షణా విమానం కుప్పకూలడంతో అందులో ఉన్న ట్రైనీ పైలట్ మృతి చెందాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో జరిగింది. అమ్రేలి పట్టణంలోని గిరియా రోడ్ ప్రాంతంలోని నివాస ప్రాంతంలో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో విమానం కూలిపోయిందని అమ్రేలి పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ ఖరత్ అన్నారు.
అధికారుల వివరాల ప్రకారం.. అమ్రేలి విమానాశ్రయం నుండి బయలుదేరిందన ఓ ప్రైవేటు సంస్థకు చెందిన శిక్షణ విమానం కాసేపటికే కూలిపోయింది. శాస్త్రి నగర్ ప్రాంతం సమీపంలో కూలిపోయిన విమానంలో మంటలు చెలరేగి దగ్ధమైంది. దీంతో అందులో ఉన్న ట్రైనీ పైలట్ చనిపోయాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని ఎస్పీ తెలిపారు.
- Advertisement -