Tuesday, April 22, 2025

మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్‌ 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌ ఫిక్సింగ్ జరిగిందని రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్‌ జయదీప్‌ బిహానీ ఆరోపణలు చేశారు.

దీనిపై స్పందించిన రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం.. మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలను ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, పూర్తి అసత్యమని పేర్కొంది. ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి, క్రీడా మంత్రికి ఫిర్యాదు చేసింది. కాగా, ఐపిఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే అవకాశం ఉందని ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలను బిసిసిఐ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News