- Advertisement -
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ పట్టణంలోని ఒక టూరిస్ట్ రిసార్ట్‌పై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్పుల్లో 10 మంది గాయపడ్డారని.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక, కాల్పులకు పాల్పడి ఉగ్రవాదుల కోసం పోలీసులతో కలిసి భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
- Advertisement -