Wednesday, April 23, 2025

చిన్న కారణంతో.. అధ్యాపకురాలిపై చెప్పుతో దాడి

- Advertisement -
- Advertisement -

విద్యాబుధ్దులు నేర్పే అధ్యాపకురాలిపై చెప్పుతో దాడి చేసింది ఓ విద్యార్థిని.. అది కూడా ఓ చిన్న కారణంతో. ఈ ఘటన ఓ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. అసలేం జరిగిందంటే.. కళాశాల ప్రాంగణంలో సదరు విద్యార్థిని ఫోన్‌లో మాట్లాడుతుంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అధ్యాపకురాలు.. విద్యార్థిని నుంచి ఫోన్ లాక్కుంది. దీంతో కోపంతో ఊగిపోయిన విద్యార్థిని.. అధ్యాపకురాలితో వాగ్వాదానికి దిగింది. ఆమె ఫోన్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చెప్పుతో దాడి చేసింది. అధ్యాపకురాలు కూడా విద్యార్థినిపై ప్రతిదాడి చేసింది. పక్కనే ఉన్న కొందరు ఇద్దరిని అడ్డుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న మరో విద్యార్థిని రికార్డు చేసింది. దీంతో ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అధ్యాపకురాలిపై దాడి చేసిన విద్యార్థినిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News