Wednesday, April 23, 2025

ఖతర్‌లో ఇల్లు కొన్న సైఫ్‌ అలీఖాన్‌.. కుటుంబం మొత్తం షిఫ్ట్!

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ త్వరలో కుటుంబంతో కలిసి ఖతార్ కు షిష్ట్ కానున్నట్లు తెలుస్తోంది. దోహాలో ఉన్న ది పెర్ల్‌లోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ఐలాండ్‌లో తాను ఇటీవల ఒక విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసినట్లు సైఫ్ అలీ ఖాన్ వెల్లడించారు. అల్ఫార్డాన్ గ్రూప్ నిర్వహించిన ఒక ప్రెస్ ఈవెంట్‌లో మాట్లాడుతూ..  ఖతార్‌లో తనకు చాలా సేఫ్టీగా అనిపించిందని, అందుకే అక్కడ ఓ ఇల్లు కొన్నానని చెప్పారు. త్వరలోనే తన కుటుంబానికి ఆ ఇల్లు చూపిస్తానని తెలిపారు. “నేను ఖతార్‌లో ఇల్లు కొనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముంబై నుంచి అక్కడికి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఖతార్ వాతావరణం అద్భుతంగా ఉంటుంది” అని చెప్పారు.

కాగా, ఇటీవల ముంబైలోని తన నివాసంలోనే సైఫ్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. వెన్నుముక్కకు కత్తిపోటు దిగడంతో సర్జరీ కూడా చేశారు. అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటన బాలీవుడ్ లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆయన ఖతార్ లో ఇల్లు కొనడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News