Wednesday, April 23, 2025

బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై కేసు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నమోదు చేశారు. ఇటీవల బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కొందరు ఫిర్యాదు చేయడంతో రాయ్ పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫూలే సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ నెటిజన్‌తో వాగ్వాదంలో ‘బ్రాహ్మణులపై మూత్రం పోస్తాను. నీకేమైనా సమస్యా?’ అని అనురాగ్ ప్రశ్నించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఈ క్రమంలోనే రాయ్ పూర్ కు చెందిన జాతీయ ఉపాధ్యక్షుడు, రాష్ట్రీయ బ్రాహ్మణ మహాసంఘ్ (భారత్) ఛత్తీస్ గఢ్ ఇన్ చార్జి పండిట్ నీలకాంత్ త్రిపాఠి సోమవారం రాత్రి.. సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.

కాగా, తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు అనురాగ్ కశ్యప్ తెలిపారు. ఆవేశంలో హద్దు దాటి ప్రవర్తించానని, బ్రాహ్మణులందరూ తనను క్షమించాలని కోరారు. ఆగ్రహంలో అలా నోరు జారానని తాజాగా వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News