Wednesday, April 23, 2025

కౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తయింది. కౌశిక్ రెడ్డి పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. కమలాపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు కొట్టేయాలని కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 1న ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన కౌశిక్ రెడ్డి.. తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లు ఎన్నికల అధికారి కమలాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు అయింది. దర్యాప్తు నిర్వహించిన పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు.

నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు విచారణ పెండింగ్‌లో ఉంది. అయితే రాజకీయ కక్ష్యల వల్లే కేసు నమోదు చేశారన్న కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని న్యాయవాది రమణారావు తెలిపారు. మరోవైపు ఎన్నికల ప్రచారసభలో ఆత్మహత్య పేరుతో కౌశిక్ రెడ్డి ఓటర్లను బెదిరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కోడ్ ఉల్లంఘించినందుకే నోడల్ అధికారి ఫిర్యాదుతో కేసు పెట్టారని పిపి అన్నారు. అయితే సాక్షులుగా ఓటర్ల వాంగ్మూలం ఎందుకు నమోదు చేయలేదని లాయర్‌ని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News