- Advertisement -
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ సిటీలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, కొత్త పేట్ నారాయణ కాలేజీలో బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్న అరుంధతి అనే విద్యార్థిని.. బోటనీలో ఫెయిల్ అయింది. దీంతో మనస్థాప్తానికి గురైన అరుంధతి.. ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలపడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Advertisement -