జమ్మూ కాశ్మీర్‌లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడి తనను తీవ్ర వేదనకు గురిచేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులపై ఆయన స్పందించారు. ఇది పిరికిపంద, అమానవీయ క్రూరమైన చర్య అని..ఈ ఘటనలో బాధ్యులను వదిలిపెట్టబోమని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా, ఈ ఉగ్రదాడిలో ఇప్పటివరకు 27 మంది పర్యాటకులు మృతి చెందిగా పలువురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రదాడిని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా చెప్పారు.