Wednesday, April 23, 2025

భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి రోడ్‌మ్యాప్

- Advertisement -
- Advertisement -

భారత్‌తో వాణిజ్య ఒప్పందం రూపురేఖలను యుఎస్ ఖరారు చేసింది. యుఎస్ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మంగళవారం జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారు. వాన్స్ తన భార్య ఉషా వాన్స్, పిల్లలతో పాటు నాలుగు రోజుల పర్యటనపై సోమవారం న్యూఢిల్లీ చేరుకున్న విషయం విదితమే. ‘అమెరికా, భారత్ వాణిజ్య సంప్రదింపులకు పరిశీలనాంశాలను అధికారికంగా ఖరారు చేశాయి’ అని ఆయన తెలిపారు. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 26 శాతం ప్రతీకార టారిఫ్‌లు పరిశ్రమలను కలవరపరచగా రెండు దేశాల మధ్య ప్రస్తుతం సాగుతున్న వాణిజ్య చర్చలపై తాజా సమాచారాన్ని వాన్స్ అందజేశారు. ట్రంప్ ఆ తరువాత 90 రోజుల విరామం ప్రకటించారు. దీనితో టారిఫ్ బాధిత దేశాలకు తాత్కాలికంగా ఊరట లభించింది. మరొక వైపు దేశ ప్రయోజనాలకు అగ్ర ప్రాధాన్యం ఇస్తూ భారత్ సంప్రదింపులు సాగిస్తున్నట్లు తెలియజేసింది. ‘అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ లక్షం సాకారం దిశగా ఇది కీలక అడుగు అని నా విశ్వాసం. ఎందుకంటే ఇది మన దేశాల మధ్య తుది ఒప్పందం దిశగా ఒక రోడ్‌మ్యాప్‌ను నిర్దేశిస్తుంది’ అని వాన్స్ చెప్పారు.

ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ మరునాడు వాన్స్ మాట్లాడుతూ,భారత్, యుఎస్ రెండూ వృద్ధి చెందాలని ట్రంప్ వాంఛిస్తున్నట్లు తెలియజేశారు. ప్రధాని మోడీని ‘గట్టి సంభాషణలకర్త’గా వాన్స్ అభివర్ణిస్తూ, ఆయనను యుఎస్ గౌరవిస్తున్నది అందుకే అని చెప్పారు. ‘ప్రధాని మోడీ గట్టి సంభాషణలకర్త. ఆయన బాగా బేరసారాలు ఆడతారు. మేము ఆయనను గౌరవిస్తుండడం ఒక కారణం’ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌ను వాన్స్ కొనియాడుతూ, అమెరికా ‘ఇక్కడ ఉన్నది భారత్‌కు ప్రవచనం ఇవ్వడానికి కాదు, ఒక భాగస్వామిగా ఉండడానికే’ అని చెప్పారు. ‘ఈ విధంగా మీరు చేయవలసిందని చెప్పేందుకు మేము ఇక్కడ లేము. గతంలో తరచు ప్రవచనం దృక్పథంతోనే వాషింగ్టన్ ప్రధాని మోడీని సంప్రదించింది. పూర్వపు ప్రభుత్వాలు భారత్‌ను మాకు తక్కువ వ్యయంతో శ్రామికులను సమకూర్చే దేశంగా భావించాయి’ అని వాన్స్ తెలియజేశారు. ప్రధాని మోడీ ప్రజాదరణ పెరుగుతోందని కూడా ఆయన చెప్పారు. అది తనను ఈర్షాళువును చేస్తోందని ఆయన జోక్ చేశారు.

‘ప్రజాస్వామ్య ప్రపంచంలో అత్యంత పాప్యులర్ అయిన ప్రధాని ప్రభుత్వాన్ని వారు ఒక వైపు విమర్శిస్తుండగా, సోమవారం రాత్రి ప్రధాని మోడీతో చెప్పినట్లుగా ఆయన అప్రూవల్ రేటింగ్‌లు నన్ను ఈర్షాళువును చేస్తున్నాయి’ అని వాన్స్ జైపూర్‌లో చెప్పారు.
భారత్, యుఎస్ అనుబంధం కుటుంబ తరహాది
యుఎస్, భారత్ భాగస్వామ్యం కుటుంబం తరహా అనుబంధంగా రూపుదిద్దుకుంటున్నదని వాన్స్ పేర్కొన్నారు. తమ భారత పర్యటనలో తన పిల్లలు ప్రధాని మోడీను అమితంగా ఇష్టపడ్డారని ఆయన వెల్లడించారు. సోమవారం రాత్రి మోడీ ఆతిథ్యం తనను అమితంగా ఆకట్టుకున్నదని, తన పిల్లలు ఆయనను ఇష్టపడ్డారని వాన్స్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News