Wednesday, April 23, 2025

సామాజిక న్యాయం చుట్టూనే రాహుల్ ఆలోచనలు

- Advertisement -
- Advertisement -

రోహిత్ వేముల చట్టం కోసం ఆయన రాసిన
లేఖ నన్ను కదిలించింది అమలు దిశగా
చర్యలు చేపడతాం : సిఎం రేవంత్‌రెడ్డి
హిరోషిమా సందర్శించడం గౌరవంగా ఉంది

మనతెలంగాణ/హైదరాబాద్: శాంతితో పాటు సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హిరోషిమాను సందర్శించిన తెలంగాణ బృందం పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై అక్కడి ప్రభుత్వంతో సిఎం రేవంత్ బృందం చర్చించింది. ఈ సందర్భంగా హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌తో సిఎం రేవంత్ సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ, హిరోషిమా కలిసి పని చేయగలిగే రంగాలపై విస్తృతంగా చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు. వ్యర్థాల నుంచి ఇంధనం లాంటి క్లీన్ టెక్నాలజీ, మున్సిపాలిటీల్లో వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగు నీటి శుద్ధి,

పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, అర్భన్ ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్‌లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రస్తావించారు. వీటితో పాటు విద్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు, పరిశోధనలకు సహకారం, తెలంగాణ సంస్కృతీ, శాంతి, పర్యాటకం, పీస్ పార్క్, సాంస్కృతిక ప్రదర్శనలు, బౌద్ధ వారసత్వానికి సహకరించాలని మంత్రి వారిని కోరారు.

హిరోషిమా అసెంబ్లీని సందర్శించిన సిఎం
అనంతరం హిరోషిమా అసెంబ్లీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ హాల్ సందర్శనకు వెళ్లిన బృందానికి అసెంబ్లీ స్పీకర్ తకాషి నకమోటో, వారి శాసనసభ్యుల బృందం ఘనంగా స్వాగతించింది. హిరోషిమా అంటే ఆశ అని, ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమని ప్రపంచానికి నిరూపించిన నగరం హిరోషిమా అని రేవంత్ తెలిపారు. శాంతి, స్థిరత్వం, సమృద్ధి వంటి విలువలను పంచుకుందామని మంత్రి శ్రీధర్‌బాబు హిరోషిమా ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. కలిసికట్టుగా మెరుగైన, పచ్చని, సమగ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దామని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. ఇప్పటికే యాభైకి పైగా జపాన్ కంపెనీలు తెలంగాణలో అద్భుతంగా పనిచేస్తున్నాయని, మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం, శాసనసభ్యుల బృందం రేవంత్ రెడ్డి బృందాన్ని గాంధీ మెమోరియల్, హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అణుబాంబు డోమ్‌ల వద్దకు తీసుకెళ్లింది.

మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి
హిరోషిమా నగరంలో పర్యటించిన సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివా ళి అర్పించారు. అలాగే షిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అటామిక్ బాంబ్ డోమ్‌ను సిఎం స ందర్శించారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన రెండో ప్ర పంచ యుద్ధంలో అణుబాంబు దాడిలో మృతిచెందిన వారికి పూలమాల వేసి నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News