Wednesday, April 23, 2025

కశ్మీర్ ఉగ్రదాడి.. ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి, కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోడీతో జరిగిన ఫోన్ కాల్‌లో ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని న్యాయం ముందు నిలబెట్టడానికి అమెరికా అధ్యక్షుడు భారత్ కు పూర్తి మద్దతు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో.. “అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయకులు మరణించినందుకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. “ఉగ్రవాద దాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్, యునైటెడ్ స్టేట్స్ కలిసి ఉన్నాయి” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News