Wednesday, April 23, 2025

గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో భాష్య‌కార్ల ఉత్స‌వాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ భాష్య‌కార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్స‌వాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇవాళ్లి నుంచి మే 2వ తేదీ వ‌ర‌కు ఈ ఉత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 గంట‌ల‌కు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పెద్దమాడ వీధి ఉత్సవం నిర్వ‌హిస్తారు. ఉద‌యం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం జ‌రుగ‌నుంది. మే 1న భోగి తేరు, మే 2న సాత్తుమొర జ‌రుగ‌నుంది. ఆల‌యంలో మే 3న గంధ‌పొడి ఉత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News