Wednesday, April 23, 2025

అది గాడ్ గిఫ్ట్ అని భావిస్తాను

- Advertisement -
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా విజయశాంతి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా, తల్లిగా చాలా విరామం తర్వాత ఒక పవర్ ఫుల్ పాత్ర చేయడం జరిగింది. ప్రజలు రాములమ్మని విజయశాంతిని ఎలాంటి పాత్రలో చూడాలని అనుకున్నారో ఈ సినిమాతో అది ఫుల్ ఫిల్ అయ్యింది. ఇప్పుడు యాక్షన్ అనేది ఒకరకంగా నాకు ఛాలెంజ్.

కానీ నేను చేశాను. యాక్షన్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. సినిమాలో అందరూ వారి పాత్రలని అద్భుతంగా చేశారు. అందుకే సినిమాకి అద్భుతమైన ఫలితం వచ్చింది. -ఈ సినిమాలో తల్లితండ్రులు కొడుకుల బంధాన్ని బలంగా చూపించడం జరిగింది. ఈ కథని దర్శకుడు పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేశారు. మంచి సినిమా చేశామనే తృప్తి వందశాతం వుంది. చాలామంది మహిళలు ఫోన్ చేసి సినిమా అద్భుతంగా వుంది, మదర్ అండ్ సన్ ఎమోషన్ కట్టిపడేసిందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. పరీక్షల వలన కొందరు చూడలేకపోయారని నాకున్న సమాచారం. బుధవారం అందరం వెళ్తామని చెబుతున్నారు. దీంతో ప్రేక్షకాదరణ ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. ఈ సినిమా క్లైమాక్స్ విన్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను.

చాలా కొత్తగా ఉందనిపించింది. హీరో అలా చేయడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను. అసలు ఫ్యాన్స్, ఆడియన్స్ ఒప్పుకుంటారా అనిపించింది. నిజంగా అది ఒక ప్రయోగం. అది ఆడియన్స్‌కు నచ్చింది. కెరీర్ ప్రారంభం నుంచి నా ట్రాకే సపరేటు. ప్రతిఘటన, నేటి భారతం, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ, మొండి మొగుడు పెంకి పెళ్ళాం.. ఇలా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశాను. ఇన్ని రకాల పాత్రలు చేయడం నాకు కుదిరింది. ఇది గాడ్ గిఫ్ట్ అని భావిస్తాను.- నా కెరీర్‌లో చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ, శోభన్ బాబు… ఇలా హీరోలు అందరితో ఫుల్ గ్లామరస్ రూల్స్ చేశాను. ఇటు చంద్రమోహన్ లాంటి హీరోలతో పని చేశాను. దాదాపు 60 మంది హీరోలతో కలిసి పని చేశాను. చాలా ప్రయోగాలు చేశాను. నా ప్రతి సినిమాకి వేరియేషన్ ఉంటుంది. ఒకదానికి ఒకటి పోలిక ఉండదు. ఇదంతా అదృష్టంగా భావిస్తు న్నాను. దేవుడు నాకు అలా రాసిచ్చాడు” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News