అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎపి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 81.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణతతో తొలి స్థానంలో ఉందని, 1,680 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయని ఆయన ప్రశంసించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మంత్రి లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విజయం సాధించని విద్యార్థులు నిరుత్సాహపడవద్దని, జీవితంలో రెండో అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28 వరకు జరుగుతాయని, విజయం సాధించడానికి మరొక అవకాశాన్ని అందిస్తున్నామని లోకేష్ వివరించారు.
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి