Wednesday, April 23, 2025

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

పసిడి కొనుగోలు దారులకు గుడ్ న్యూస్. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో సామాన్యులకు స్వల్ప ఊరట లభించింది. ఇప్పటికే తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిదే. అయితే, తాజాగా గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,750 వేలు ధర తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3 వేలు ధర తగ్గింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,150కి చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,350గా ఉంది. అలాగే, వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ. 1,11,000గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News