ములుగు: కర్రెగుట్టపై భద్రతా బలగాలు హెలికాప్టర్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నాయి. పోలీస్ బలగాలు, మావోయిస్టులు
అంతిమ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మందు పాతరలు పేల్చడానికి మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు. మావో అగ్ర నేతలు హింస వద్దంటున్నారు. పౌర హక్కుల నేతలు కేంద్రంతో చర్చలు జరుపుతామని హామీ ఇస్తున్నారు. కర్రె గుట్టలపై మావోయిస్టు దళాలు ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా దళం కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం.
గత రెండు రోజుల నుంచి చత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసు బలగాలు సంయుక్త ఆపరేషన్‌లో 50 వేల మంది భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టారు. దీనితో కర్రెగుట్టల అడవిలో భీకరపోరు మొదలైంది. ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడచూసినా పోలీసులే దర్శనమిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న కర్రెగుట్టలను, అటునుంచి చత్తీస్‌గఢ్ పోలీస్ బలగాలు ఇటువైపు నుంచి తెలంగాణ పోలీస్ చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో కర్రెగుటల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోనుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవైపు కేం ద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 2025 సంవత్సరాంతానికల్లా మావోయిస్టులను పూర్తిగా మట్టుపెడతామని ప్రకటించిన విషయం విధేయతమే. ఈ నేపథ్యంలోనే పోలీసు బలగాలు సంయుక్త ఆపరేషన్ మొదలు పెట్టినట్లు సమాచారం.