శ్రీనగర్: కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై కాల్పులకు జరిపిన ఉగ్రవాదుల స్కెచ్ ల, ఫోటోలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ముగ్గురు నుండి నలుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు అధికారులు చెప్పారు. పహల్గామ్‌లోని ప్రసిద్ధ బైసరన్ గడ్డి మైదానంలో AK47 గన్స్ తో 20 నిమిషాల పాటు నిరంతరం కాల్పులు జరిపారని సమాచారం. దాడి చేసిన వారు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
జమ్మూ కాశ్మీర్‌లోని బహల్గామ్‌లో మంగళవారం బైసరన్ లోయలో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 పర్యాటకులు మరణించారు. పేరు, మతం అడిగి మరీ.. దారుణంగా కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారు.కాగా, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలతో బయటపడిన వారిని మరియు బాధితుల కుటుంబాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.