Wednesday, April 23, 2025

జమ్మూ కాశ్మీర్ లో ఇరుక్కుపోయిన మెదక్ వాసులు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: మెదక్ పట్టణానికి చెందిన కపిల్ చిట్ ఫండ్ మెనేజర్ పవన్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి జమ్ముకాశ్మీర్ వెళ్లాడు. మంగళవారం  సాయంత్రం శ్రీనగర్ నుండి కాశ్మీర్ కు వెళ్లారు.  పహల్ గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను టార్గెట్ చేస్తూ 28 మందిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం మెదక్ వాసులను సురక్షితంగా ఒక హోటల్ లోకి తరలించారు. తమతో పాటు మొత్తం 80 మంది ఉన్నామని పవన్ తెలిపాడు. వెంటనే తమను స్వస్థలాలకు తరలించాలని బాధితులు కోరుతున్నారు. బాధితులు క్షణక్షణం ప్రాణ భయంతో ఆందోళన చెందుతున్నారు. ఇంటివద్ద కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెండుతున్నారు. సాయంత్రంలోగా మెదక్ వాసులను హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో తరలించనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News