- Advertisement -
జమ్ముకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామ్ ఉగ్రదాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండించాయి. పలు దేశాలు భారత్ కు మద్దతు తెలిపాయి. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియం వేదికగా జరగబోయే ఐపిఎల్ మ్యాచ్ లో ముంబై, హైదరాబాద్ జట్ల ప్లేయర్లు, అంపైర్లు చేతులకు నల్ల బ్యాండ్లు ధరించనున్నారు. అలాగే మ్యాచుకు ముందు నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. ఈ మ్యాచ్ లో చీర్ లీడర్లు, ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్స్‌ను కూడా నిర్వాహకులు రద్దు చేసినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఉగ్రదాడిలో ఇప్పటివరకు 26మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
- Advertisement -