Thursday, April 24, 2025

టెన్త్ ఫలితాల్లో రికార్డు.. 600కు 600 మార్కులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలో పదో పరగతి పరీక్షల ఫలితాల్లో కాకినాడ విద్యార్థిని చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కాకినాడకు చెందిన విద్యార్థిని యల్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించింది. వందకు వందశాతం మార్కులు తెచ్చుకున్న తొలి విద్యార్థినిగా నేహాంజని నిలిచింది. దీంతో ఆమెపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా.. ఎపి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 81.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణతతో తొలి స్థానంలో ఉందని, 1,680 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయని ఆయన ప్రశంసించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మంత్రి లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విజయం సాధించని విద్యార్థులు నిరుత్సాహపడవద్దని, జీవితంలో రెండో అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28 వరకు జరుగుతాయని, విజయం సాధించడానికి మరొక అవకాశాన్ని అందిస్తున్నామని లోకేష్ వివరించారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News