- Advertisement -
జమ్ముకాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ఉగ్రదాడితో మాకు సంబంధం లేదని ప్రకటించింది. ఈ మేరకు పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రదాడిలో ప్రాణనష్టం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ అప్రమత్తమై సరిహద్దులకు యుద్ధ విమానాలను తరలిస్తోంది. సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరిస్తున్న పాక్.. కాశ్మీర్ సరిహద్దుకు యుద్ధ విమానాలు తరలిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. భారత్ కు తమ మద్దతును ప్రకటించాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. మోడీకి ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు.
- Advertisement -