Thursday, April 24, 2025

ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టం.. దిమ్మతిరిగేలా జవాబు ఇస్తాం: రాజ్ నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్ లో ఉగ్రదాడులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడులకు పాల్పడిన వారిని ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టబోమని దిమ్మతిరిగేలా జవాబిస్తామని హెచ్చరించారు. ఈ దాడి నేపథ్యంలో ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులను వదిలపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా.. వారి వెనుక ఎవరు ఉన్నా.. విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో బుద్ది చెబుతామన్నారు. పహల్గామ్‌ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని.. భారత్‌ను ఎవరూ భయపెట్టలేరని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News