Thursday, April 24, 2025

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఇంటర్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. మే 22 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇక ఇంటర్ ఒకేషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు సైతం ఇదే టైం టేబుల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. జూన్ 9 నుంచి ఫస్ట్ ఇయర్, 10న సెంకడియర్ ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం అధికారిక https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ టైం టేబుల్
మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -1
మే 23 – ఇంగ్లీష్ పేపర్ -1
మే 24 – మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటని పేపర్ -1, పొలిటికల్ సైన్స్ పేపర్ -1
మే 25 – మ్యాథ్స్ పేపర్ 1బీ, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
మే 26 – ఫిజిక్స్ పేపర్ -1, ఎకానమిక్స్ పేపర్ -1
మే 27 – కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
మే 28 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -1
మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జియోగ్రఫీ పేపర్ -1
ఇంటర్ సెకండియర్ టైం టేబుల్
మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2
మే 23 – ఇంగ్లీష్ పేపర్ -2
మే 24 – మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటని పేపర్ -2, పొలిటికల్ సైన్స్ పేపర్ -2
మే 25 – మ్యాథ్స్ పేపర్ 2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2
మే 26 – ఫిజిక్స్ పేపర్ -2, ఎకానమిక్స్ పేపర్ -2
మే 27 – కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2
మే 28 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -2, జియోగ్రఫీ పేపర్ -2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News