Thursday, April 24, 2025

పంటల బీమాపై కసరత్తు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతాంగం ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఆదిశగా సిఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతన్నల సం క్షేమం దిశగా పంటల భీమా పథకం అమలుచేసేందుకు కసర త్తు చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసా య, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావుతో పాటు సంబంధిత ఇతర అధికారులతో పంటల బీమా  పథకం అమలుకు సంబంధించిన ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పంటల భీమా పథకం కింద రైతులందరికి భీమా అందేలా, ఏఏ పంటలకు భీమా పథకాన్ని వర్తింపచేయాలనే అంశాలపై మంత్రి నిపుణులతో చర్చించారు. వానాకాలం, యాసంగి కాలాల్లో ఏఏ పంటలకు ఏఏ విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. నష్టం కలిగే సంభావ్యత ఆధారంగా రాష్ట్రాన్ని పదకొండు క్లస్టర్లుగా విభజించడం జరిగిందని, సాధారణంగా వానాకాలం సీజన్ లో సుమారు 128 లక్షల ఎకరాలలో రైతాంగం పంటలు వేయడం జరుగుతుందని అధికారులు వివరించారు.

ప్రధానంగా వాటిలో వరి 66.78 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.23, పత్తి 44.75, మిర్చి 1.90, సోయాబీన్ 3.80, కంది 5.21 లక్షల ఎకరాలు సాగుజరుగుతుందని వివరించారు. యాసంగి పంటకాలంలో మొత్తం 78 లక్షల ఎకరాలల్లో పంటలు సాగు అవుతున్నాయని, వాటిలో వరి 59 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 9, వేరుశనగ 2.2, శనగ 1.7 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు మంత్రికి వివరించారు.ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానాకాలానికిగాను మొత్తం ప్రీమియంలో రైతు వాటా రెండు శాతం, యాసంగి పంటకాలంలో 1.5 శాతం, వాణిజ్య, ఉద్యానపంటలకు గాను ఐదు శాతం ప్రీమియం ఉంటుందని, మిగిలిన ప్రీమియంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం 50:50 వాటాగా భరిస్తున్నట్లు తెలిపారు. రైతులందరికి పంటలభీమా వర్తింపచేయడం వల్ల స్థూల పంట విస్తీర్ణంలోని 98 శాతం విస్తీర్ణానికి భీమా వర్తిస్తుందని మంత్రికి అధికారులు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వాతావారణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల, అధిక వర్షాల వల్ల వడగండ్ల వానల వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల కలిగే పంట నష్టానికి పంటల భీమా పథకం అమలు ద్వారా రైతులకు కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీచేయడానికి అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దిగుబడి ఆధారిత భీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశనగ, శనగ, నువ్వులు, మొదలైన పంటలు వాతావరణ ఆధారిత భీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ పామ్, టమాట, బత్తాయి వంటి పంటలకు భీమా వర్తింపచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి వెల్లడించారు. పూర్తిస్థాయిలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంటల భీమాపథకానికి కావాల్సిన రూపకల్పన చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. ఎండాకాలంలో వడగళ్ల వర్షం వల్ల నష్టపోయే వరి, మామిడి వంటి ప్రధాన పంటలకు పూర్తి స్థాయి నష్ట పరిహారాన్ని రైతులకు అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అమలుచేస్తున్నాయనేది అధ్యయనం చేసి, రైతులందరికి ప్రయోజనం చేకూరే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా టెక్నాలజీ ఆధారంగా పంటల దిగుబడి అంచనాలను రూపొందించడం, నష్టపోయిన పంటల విషయంలో భీమా కంపెనీలు సత్వరమే భీమా క్లైమ్ లు అందించేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి సూచించారు. వానాకాలం, యాసంగి పంటలకు సంబంధించి రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా అన్ని రకాల ప్రధాన పంటలకు భీమా ప్రీమియం అంచనా వేసేందుకు వెంటనే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News