Thursday, April 24, 2025

గౌతమ్‌ గంభీర్‌కు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

టీమిండియా హెడ్‌ కోచ్‌, మాజీ బిజెపి ఎంపి గౌతమ్‌ గంభీర్‌ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఇటీవల జమ్ముకాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ.. టెర్రరిస్టులు తగిలిన మూల్యం చెల్లించుకుంటారని గంభీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ క్రమంలో ఆయనకు హత్య బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘ఐ కిల్ యు’ అని ‘ఐసిస్ కాశ్మీర్’ నుంచి ఈ-మెయిల్ ద్వారా గంభీర్‌కు బెదిరింపు వచ్చింది. దీంతో గంభీర్, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News