- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. గురువారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాను మరణించాడు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. జిల్లాలోని డూడు-బసంత్‌గఢ్ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నారని.. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఉగ్రవాదులను ఎరివేసేందుకు బలగాలు సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు.
- Advertisement -