జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. సైనికుల వేషంలో వచ్చిన ముష్కరులు పర్యాటకులపై దాడి చేసి.. 26 మంది ప్రాణాలు తీశారు. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో చిత్రీకరించే సినిమాల్లో పాకిస్థాన్ నటీనటులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ఇమాన్వీ పాకిస్థాన్‌కు చెందినది కావడమే. ఫౌజీతో పాటు.. వాణీ కపూర్ నటిస్తున్న అబిర్ గులాల్ సినిమా కూడా ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో నటిస్తున్న ఫవాద్ ఖాన్ కూడా పాకిస్థానీయే. పాకిస్థాన్ నటీనటులపై బ్యాన్ పడితే.. ఈ రెండు చిత్రాలు ఆగిపోతాయి. కానీ, సినిమాలు ఆగిపోయినా ఫర్వాలేదు.. పాకిస్థానీ నటీనటులు మాత్రం మాకొద్దు అంటూ డిమాండ్ చేస్తున్నారు.