Thursday, April 24, 2025

ఉగ్రదాడి మృతులకు సిఎం రేవంత్ రెడ్డి నివాళి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గురువారం సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఎఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎంపిలు రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ ఉగ్రదాడిలో 28 పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కాగా, జపాన్‌ పర్యటన ముగించుకుని నిన్న సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న సిఎం రేవంత్ కు పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News