Friday, April 25, 2025

భారత నిర్ణయాలను కాపీ కొట్టిన పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పహల్‌గావ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతి చర్యగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. సింధు జలాల ఒప్పందం నిలిపివేత. పాక్ పౌరులకు వీసాల రద్దు వంటి నిర్ణయాలను భారత్ తీసుకుంది. అయితే ఈ చర్యలపై పాకిస్థాన్ స్పందించింది. దాదాపు భారత్ తీసుకున్న నిర్ణయాలనే పాకిస్థాన్ కాపీ కొట్టింది. భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.

అంతేకాక.. భారత విమాన సంస్థలకు పాక్ గగనతలాన్ని తక్షణం మూసివేసింది. దీంతో సౌదీ పర్యటన ముగించుకున్న అనంతరం తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించిన విమానం కూడా పాక్ గగనతంలోకి వెళ్లకుండా వేరే మార్గంలో ప్రయాణించింది. దీంతో పాటు భారతీయులకు సార్క్ వీసాలను నిలిపివేస్తున్నట్లు పాక్ సర్కార్ ప్రకటించింది. తద్వారా తమ దేశంలో పర్యటిస్తున్న భారత జాతీయులకు అనుమతులతో పాటు ఇతర వీసాలను సైతం పాక్ రద్దు చేసింది. ఇంకా వాఘా సరిహద్దును మూసివేసిన పాకిస్థాన్.. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యవేత్తల సంఖ్యను 30గా తగ్గించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News