Friday, April 25, 2025

ఫ్యామిలీతో మాట్లాడేందుకు వీల్లేదు

- Advertisement -
- Advertisement -

రాణా దరఖాస్తుపై న్యాయస్థానం స్పందన

న్యూఢిల్లీ : ముంబై ఉగ్రదాడుల నిందితుడు, ఇప్పుడు జైలులో విచారణలో ఉన్న తహవూర్ హుస్సేన్ రాణాకు చుక్కెదురైంది. తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలనే ఆయన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు గురువారం తిరస్కరించింది. ఆయనకు ఈ అనుమతి ఇవ్వడానికి వీల్లేదని ప్రత్యేక న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ స్పష్టం చేశారు. దర్యాప్తు ఇప్పుడు కీలక దశలో ఉన్నందున ఇందుకు ఆటంకం కల్పించే ఎటువంటి ఆదేశాలకు తాము దిగడానికి వీల్లేదని ప్రత్యేక న్యాయమూర్తి చెప్పారు. ఆయన పెట్టుకున్న దరఖాస్తును జాతీయ దర్యాప్తు సంస్థ వ్యతిరేకించింది. ఈ సంస్థ వైఖరిని పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుఉను తోసిపుచ్చుతున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News