Friday, April 25, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ తమ సొంత గ్రౌండ్ అయిన చిన్నస్వామిలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఒక మ్యాచ్‌ కూడా గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్‌తో దాన్ని బ్రేక్ చేయాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. మరోవైపు రాజస్థాన్‌ గత మ్యాచ్‌లో జైపూర్‌లోని తమ హోం గ్రౌండ్‌లో బెంగళూరు జట్టు చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఆ మ్యాచ్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు అదే జట్టును కొనసాగిస్తుండగా.. రాజస్థాన్ ఒక మార్పు చేసింది. తీక్షణ స్థానంలో ఫరూఖీని జట్టులోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News