Friday, April 25, 2025

ప్రతిష్టాత్మకంగా భారత్ సమ్మిట్: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబద్: శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో జరిగే భారత్ సమ్మట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచశాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమ్మిట్‌కి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే నాయకులు, నిపుణులకు తెలంగాణ ప్రభుత్వ విజన్ గురించి వివరిస్తామని.. ఇందిరా మహిళ శక్తి బజార్లు, గ్రామాల్లో ఉపాధి కల్పన తదితర అంశాల గురించి చెబుతామని అన్నారు. ఎకనమిక్ జస్టిస్, సోషల్‌ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, జెండర్ జస్టిస్, ఎకలాజికల్ జస్టిస్, యూత్ జస్టిస్, పీస్ జస్టిస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News