Friday, April 25, 2025

యంగ్ హీరోకు మెగా ఛాన్స్?

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో ఇప్పుడు అందరి చూపులు మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాపై ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని ఢీకొనే విలన్ పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట అనిల్ రావిపూడి. దీంతో ఈ పాత్రలో నటించేందుకు యంగ్ హీరో కార్తికేయ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. గతంలోనూ ఒకటి, రెండు చిత్రాల్లో విలన్‌గా తన సత్తా చాటాడు ఈ యంగ్ హీరో. దీంతో ఇప్పుడు ఈ హీరోకు మెగా ఛాన్స్ దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News