- Advertisement -
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన నెక్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో పూరి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కేవలం 60 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పూరి ప్లాన్ చేస్తున్నాడట. దీని కోసం ఆయన అన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఈ కథ మురికివాడలో సాగనుండటంతో, దానికి తగ్గట్టుగా సెట్స్ వేసేందుకు పూరి లొకేషన్స్ పరిశీలిస్తున్నారట. ఇక ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
- Advertisement -