Friday, April 25, 2025

భూదాన్ భూముల్లో అక్రమాలపై హైకోర్టు సీరియస్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
ఐఎఎస్, ఐపిఎస్‌లు బినామీల
పేర్లతో రిజిస్ట్రేషన్లు
చేయించుకున్నారని పిటిషన్
విచారణకు స్వీకరించిన
హైకోర్టు తదుపరి ఉత్తర్వులు
వచ్చే వరకు లావాదేవీలు
జరపవద్దని ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు లావాదేవీలు జరపవద్దని ఆదేశం
విచారణ జూన్ 26కు వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం పరిధిలోని భూ దాన్ భూములకు సంబంధించిన వివాదంపై హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూ ముల్లో అక్రమాలు జరిగాయని, పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపవద్దని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వం తో పాటు ఇడి, సిబిఐ, పిటిషన్‌లో పేర్కొన్న అధికారులు, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. మహేశ్ అనే వ్యక్తి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భూదాన్ బోర్డుకు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలాలంటే సిబిఐ లేదా ఇడి వంటి స్వతం త్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ అం శంపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు.

తదుపరి విచారణను హైకోర్టు జూన్ 26కు వాయిదా వేసింది. భూములకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగాయనే అభియోగాలపై విచారణకు ముగ్గు రు సభ్యులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, రఘునందన్‌రావు, శశాంక్‌లతో కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పింది. నాగారం గ్రామంలోని సర్వే నెం.181,182లో 103.22 ఎకరాల భూదాన్ భూముల అక్రమాలపై కూడా అదే కమిటీ విచారిస్తున్నదని గతంలోనే హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News