హైదరాబాద్: పెళ్లి చేసుకున్న తరువాత భార్య మరోక వ్యక్తి ప్రేమలో పడింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో భర్తను తన ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని షాద్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఫరూక్ నగర్ మండలం చిన్నచిల్కమర్రికి చెందిన ఎరుకలి యాదయ్య(32), మౌనికను ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. ఇదే సమయంలో అశోక్ తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో భర్తను చంపాలని ప్రియుడితో ప్లాన్ వేసింది.
ఫిబ్రవరి 18న ప్రియుడు యాదయ్యను కొత్తూరు మండలం గూడూరుకు తీసుకెళ్లి ఫుల్ గా మద్యం తాగించారు. మద్యం మత్తులో యాదయ్యను గొంతుకోసి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. పొలం దగ్గరకు వెళ్లిన భర్త కనిపించడంలేదని వెతికింది. ఎక్క భర్త ఆచూకీ కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మధ్యలో మౌనిక గ్రామం వదిలి షాద్ నగర్ లోని అయ్యప్పకాలనీలో ఆశోక్ తో కలిసి ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నారు. ఇద్దిరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సిఐ విజయ్ కుమార్ తెలిపారు.