Saturday, April 26, 2025

పాకిస్థాన్‌కి సపోర్ట్.. విపక్ష ఎమ్మెల్యే అరెస్ట్

- Advertisement -
- Advertisement -

గువాహటి: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశ ప్రజలందరూ పాకిస్థాన్‌పై ఆగ్రహంతో ఉన్నారు. పాక్‌కి సరైన బుద్ధి చెప్పాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఓ ఎమ్మెల్యే మాత్రం ఈ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చారు. దీంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని విపక్ష ఎఐయుడిఎఫ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ పహల్‌గామ్ ఘటనలో పాకిస్థాన్‌కు మద్ధతు ఇచ్చారు.

దీంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అమినల్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని అస్సాం సిఎం హిమంత వెల్లడించారు. అయితే అమినుల్ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. అవి పూర్తిగా అమినుల్ వ్యక్తిగతమని ఎఐయుడిఎఫ్ ప్రకటించింది. ఉగ్రవాద దాడిపై పాకిస్థాన్‌కు ఎవరు మద్ధతు ఇచ్చినా వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హిమంత వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News