హైదరాబద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది కొత్తగూడెంలో జరిగిన బహిరంగ సభలో నిరాధార ఆరోపణలు చేశారని బిజెపి క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసింది. బిజెపి అధికారంలోకి రాగానే రిజర్వేష్లు రద్దు చేస్తోందని రేవంత్ అన్నారు. దీంతో బిజెపికి పరువు నష్టం కలిగిందని పిటిషనర్ కాసం వెంకటేశ్వరులు పిటిషన్‌లో పేర్కొన్నారు. రేవంత్ మాట్లాడిన ఆడియో, వీడియో సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. దీంతో కాసం వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని ప్రజాప్రతినిధుల కోర్టు నమోదు చేసింది. అయితే ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో రేవంత్‌కు కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది.
సిఎం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
- Advertisement -
- Advertisement -
- Advertisement -